Page Loader
Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక

Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చోటుచేసుకున్న నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో, ఆయన ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వేకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అమిత్ షాకు అందించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఎక్స్ వేదిక ద్వారా, ఏపీ, తెలంగాణలో వరద ప్రభావంపై నివేదికను అమిత్ షాకు సమర్పించానని తెలిపారు. త్వరలో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తాయని, అలాగే కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన ట్వీట్