Page Loader
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. దేశవ్యాప్త ఉద్యమం.. కేంద్రానికి ముస్లిం పర్సనల్ లాబోర్డ్ హెచ్చరిక..

Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. దేశవ్యాప్త ఉద్యమం.. కేంద్రానికి ముస్లిం పర్సనల్ లాబోర్డ్ హెచ్చరిక..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లు ముస్లింలకు ప్రయోజనం కలిగించేలా కాకుండా, అవరోధంగా మారుతుందని పేర్కొంది. పార్లమెంట్‌లో ఇది ఆమోదం పొందితే, దేశవ్యాప్తంగా దీని వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్ హెచ్చరించారు.

వివరాలు 

JPC అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు 

''మేము మౌనం పాటించము.మా హక్కులను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన,రాజ్యాంగపరమైన మార్గాలను అన్వయిస్తాము. ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకునే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తాము'' అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన మౌలానా ఖలీద్ రషీ ఫరంగి మహాలి మాట్లాడుతూ, ముస్లిం సంస్థలు తమ అభ్యంతరాలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కు తెలియజేశాయని, అయితే వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రార్థన, ఉపవాసం, తీర్థయాత్ర వంటి ప్రాథమిక ఇస్లామిక్ ఆచారాలతో సమానంగా వక్ఫ్ ఆస్తులు కూడా మతపరంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. ముస్లింల మనోభావాలను గుర్తించి, ప్రతిపాదిత సవరణలను తిరస్కరించాలని పార్లమెంట్ సభ్యులకు ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

బిల్లులోని కొన్ని అంశాలపై మరింత చర్చ అవసరం 

ఇదిలా ఉండగా, కొందరు న్యాయ నిపుణులు ఈ బిల్లులోని మార్పులను స్వాగతించారు. వారణాసిలోని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, ఈ బిల్లు వక్ఫ్ బోర్డులకు గతంలో ఉన్న అపరిమిత అధికారాలను తగ్గించిందని, ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. అయితే, బిల్లులోని కొన్ని అంశాలపై మరింత చర్చ అవసరమని ఆయన పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న  డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్