Page Loader
విమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్
అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్

విమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 31, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ పులకరించిపోయారు. ఈ మేరకు ఇండిగో విమానంలో ఆయనకు అనుహ్య స్వాగతం లభించింది.ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో సందడి చేస్తోంది. ఇండిగో విమానం ద్వారా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌కు సేవ చేసే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది.తమ విమానంలో నేషనల్‌ హీరోస్‌ ఉండటం ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుందని పోస్ట్‌ చేసింది. ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ను ఎయిర్‌హోస్ట్ పూజా ప్రయాణికులకు పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఆమె భావోద్వేగానికి గురైంది. విమానంలోకి వచ్చిన ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ బృందానికి కంగ్రాట్యూలేషన్స్ చెప్పిన పూజా, మీరు ఇండిగో విమానంలో ఉన్నందుకు గర్విస్తున్నామన్నారు. భారత్ గర్వపడేలా చేసిందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పగా, ప్రయాణికులు చప్పట్లు మోగించారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో