
Air India: హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయిల్‌లో వాణిజ్య హబ్‌గా పేరున్న టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం హౌతీ తీవ్రవాదులు క్షిపణి దాడి జరిపారు.
ఈ క్షిపణి విమానాశ్రయం మూడో టెర్మినల్‌కు ఎంతో సమీపంలో పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ దాడికి సంబంధించి స్పందించిన ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్, ఈ దాడికి పాల్పడిన వారిని ఏకంగా 7 రెట్లు తీవ్రంగా ఎదురు దాడులు చేసి శిక్షిస్తామని హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా తాత్కాలికంగా టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాలను నిలిపివేసింది.
Details
ప్రయాణికుల టికెట్ల డబ్బులు వాపసు
మే 6 వరకు టెల్ అవీవ్ విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని మధ్యలోనే అబుదాబికి మళ్లించినట్లు వెల్లడించింది.
ప్రయాణికుల టికెట్లకు పూర్తి డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పింది.
ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.