LOADING...
Air India flight: ఆకాశంలో ఉండగా ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు..  
ఆకాశంలో ఉండగా ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు..

Air India flight: ఆకాశంలో ఉండగా ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 10, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో ముంబయి నుండి న్యూయార్క్‌కి వెళ్తున్న విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయిన ప్రదేశానికే తిరిగి దింపారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం... బోయింగ్ 777 విమానం ముంబై నుండి న్యూయార్క్‌ వైపుకు ప్రయాణమవుతోంది. అయితే, నాలుగు గంటల తర్వాత అజర్‌బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తుండగా బాంబు బెదిరింపు హెచ్చరిక వచ్చింది. ఈ సమాచారం సిబ్బందికి అందిన వెంటనే, అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని ముంబయి వైపుకు మళ్లించారు. అక్కడ ల్యాండింగ్ చేసిన వెంటనే బాంబ్‌ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, సమగ్ర తనిఖీలు ప్రారంభించింది. చివరికి, ఇది నకిలీ కాల్‌గా తేలింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు..