Loading...
Microsoft Outage: మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం

Microsoft Outage: మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన అంతరాయం భారత్‌లోని విమానయాన సంస్థల కార్యకలాపాలపైనా ప్రభావం చూపింది. ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబై నగరాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. దీనిపై ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రకటన విడుదల చేసింది. స్పైస్‌జెట్ ఎదుర్కొంటున్న పలు సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని విమాన సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. విమానాల తాజా సమాచారం కోసం ప్రయాణికులు నేరుగా స్పైస్‌జెట్‌ను సంప్రదించాలని సూచించింది.

వివరాలు 

ఇండిగో విమానయాన సంస్థపైనా ప్రభావం

మరోవైపు మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఇండిగో విమానయాన సంస్థపైనా ప్రభావం చూపింది.

తమ ఈమెయిల్ సపోర్ట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని, ప్రస్తుతం తమకు ఎలాంటి ఈమెయిల్స్ అందడం లేదని ఇండిగో ఎక్స్ వేదికగా వెల్లడించింది.

అయితే ఇతర కస్టమర్ సపోర్ట్ మార్గాలు యథావిధిగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

అత్యవసర సహాయం అవసరమైన ప్రయాణికులు తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 6ఈ స్కాయ్‌ను సంప్రదించాలని సూచించింది.

ఇదిలా ఉండగా.. మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయాన్ని గమనిస్తున్నామని ఎయిరిండియా ప్రకటించింది.

అయితే ఈ సమస్య తమ విమానయాన సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది. తమ కమ్యూనికేషన్ వ్యవస్థల్లోనూ ఎలాంటి అంతరాయం లేదని ఎక్స్‌లో పేర్కొంది.

వివరాలు 

ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365 వంటి ప్లాట్‌ఫాంల సేవలకు అంతరాయం

ప్రయాణికులకు వేగంగా సేవలు అందించేందుకు ఈమెయిల్ వ్యవస్థను మరో మార్గానికి మళ్లించినట్లు తెలిపింది.

దీంతో తమకు వచ్చే ప్రతి సందేశం ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరుతుందని వివరించింది.

కాగా.. మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365 వంటి ప్లాట్‌ఫాంల సేవలకు అంతరాయం ఏర్పడింది.

దీంతో వివిధ రంగాలకు చెందిన సంస్థల కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పైస్‌జెట్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండిగో చేసిన ట్వీట్ 

ADVERTISEMENT