Page Loader
Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2024
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఇటీవల మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ ఫేజ్‌లో 116.2 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రూ. 32,237 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంగా చేపట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లతో కలిపి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు కారిడార్-4 ప్రాజెక్టును ప్రతిపాదించారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రయాణికులు సులభంగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు కారిడార్‌-1, 2, 3లను కొత్తగా ప్రతిపాదించిన కారిడార్-4తో అనుసంధానం చేయనున్నారు.

Details

తెలంగాణ

నాగోల్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మేర కారిడార్-4 రూపొందించారు. ఈ మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఇప్పటికే ఉన్న మెట్రో మార్గాల్లో కారిడార్-1 ఎల్బీనగర్-మియాపూర్, కారిడార్-2 జేబీఎస్-ఎంజీబీఎస్, కారిడార్-3 రాయదుర్గం-నాగోల్ రూట్లను కారిడార్-4కు అనుసంధానం చేయనున్నారు. ఈ నాలుగు కారిడార్ల అనుసంధానంతో, నగరంలోని ఎక్కడి నుంచి అయినా మెట్రోలో ఎయిర్‌పోర్టుకు చేరుకునే అవకాశం కల్పించనున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం, కొత్త హైకోర్టు మీదుగా మెట్రో మార్గాన్ని మార్చారు. ట్రాఫిక్ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మెట్రో మార్గం రూపొందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలిసింది.