Ajit Pawar: మరణానికి ముందు ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, గత నెల 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం బారామతి బయలుదేరిన ఆయన, విమానం ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ముంబైలో విమానం ఎక్కే ముందు ఆయన చివరి ఫోన్ కాల్ ఎన్సీపీ నేత శ్రీజిత్ పవార్‌కు చేశారు. తాజాగా ఆ ఫోన్ సంభాషణను శ్రీజిత్ పవార్ బయటపెట్టారు. ఆయన ప్రకారం, అజిత్ పవార్ తనతో ఐక్యత, సమానత్వం విషయంలో సూచనలు ఇచ్చారని తెలిపారు.
వివరాలు
కులమత భేదం చూపకుండా అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచన
శ్రీజిత్ పవార్ మాట్లాడుతూ, "పార్టీ వ్యవహారాల గురించి దాదా (అజిత్ పవార్)తో ఒక విషయం చర్చించాలనుకుని ఆ రోజు ఉదయం ఫోన్ చేశా. కానీ, నెట్‌వర్క్ సమస్యల కారణంగా కాల్ రీచ్ కాలేదు. తరువాత, ఒక మెసేజ్ పెట్టాను. నెట్‌వర్క్ కవరేజ్ లభించిన తర్వాత, దాదా ఆ మెసేజ్ చూసి వెంటనే నాకు ఫోన్ చేశారు. పార్టీలో ఎలాంటి అసమానతలకు, వివక్షకు చోటు లేదని స్పష్టంగా చెబుతూ.. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. మహారాష్ట్ర,రాష్ట్ర ప్రజల విషయాలను దాదా ఎలా ఆలోచిస్తున్నారో అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సంభాషణకు సంబంధించిన ఆడియోను నేను విడుదల చేస్తున్నాను," అని శ్రీజిత్ పవార్ తెలిపారు.