
ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభం రోజురోజుకు ముదురుతుందే కానీ తగ్గడం లేదు. ఎన్సీపీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది.
తాజాగా అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పార్టీ, సింబల్‌ను దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
శరద్ పవార్ వర్గానికి కాకుండా ఎన్సీపీ గుర్తైన అలారం గడియారం చిహ్నాన్ని తమకే కేటాయించాలని అజిత్ పవార్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, అజిత్ పవార్ వర్గంలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పటిషన్ ఇప్పటికే ఎన్నికల సంఘం ఉన్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర
అజిత్ సమావేశానికి 29 మంది, శరద్ పవార్ మీటింగ్‌కు 17 మంది ఎమ్మెల్యేలు హాజరు
ఎన్సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు బుధవారం తమ సభ్యులతో సమావేశం నిర్వహించాయి.
అయితే ఈ సమావేశానికి 53మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 29 మంది హాజరైనట్లు, వారందరూ తమతోనే ఉన్నట్లు అజిత్ వర్గం తెలిపింది.
మరోవైపు శరద్ పవార్ నిర్వహించిన సమావేశానికి 17 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది.
ఈ క్రమంలో సమావేశానికి మెజార్టీ శాసన సభ్యులు హాజరైనందున ఎన్సీపీ అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ పోల్ ప్యానెల్ కూడా తీర్మానం చేసిందని ఆ వర్గాలు తెలిపాయి.