LOADING...
Weather Report: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

Weather Report: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాలు కొనసాగుతుండటం వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఒక్కో చోటా అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు (నేడు, రేపు) ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Details

తెలంగాణలో భారీ వర్షాలు

48 గంటల్లో ఈ అల్పపీడనం ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు శుక్రవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదు అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో కూడా అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

Details

ఈ జిల్లాలో భారీ వర్షాలు

సెప్టెంబర్‌ 2 (మంగళవారం) రానున్నందున ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Details

40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

సెప్టెంబర్‌ 3 (బుధవారం) కూడా తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది.