Telangana: నేటి పరీక్షలన్నీ వాయిదా.. యూనివర్సిటీల కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడమే కాకుండా సోమవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు.
వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. రేపటి నుంచి (సెప్టెంబర్ 3) పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కూడా స్పష్టం చేశారు.
కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ వాకాటి కరుణ, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా, సోమవారం కళాశాలలకు సెలవు ప్రకటించారు.
ఈ రోజు జరగాల్సిన థియరీ, ప్రాక్టికల్, ఇంటర్నల్ పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి చెప్పారు.
వివరాలు
జేఎన్టీయూ పరిధిలోని పరీక్షలను కూడా వాయిదా
మంగళవారం(Sep 3) నుంచి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.అలాగే జేఎన్టీయూ పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు.
బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలను సెప్టెంబర్ 5న నిర్వహిస్తామని రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.