Page Loader
Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం

Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పోటీపడుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఈ ఫైనల్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఫైనల్‌కు ముందు,పోటీలో పాల్గొంటున్న అందాల మహిళలు హైటెక్స్‌ సమీపంలోని ట్రైటెండ్ హోటల్‌లో రిహార్సల్స్‌ నిర్వహించారు. ప్రదర్శనకు ముందు వారు అన్ని వివరాలు పరిశీలిస్తూ,మెరుగు చేసే విధంగా సాధన చేశారు. ఈ కార్యక్రమానికి ముందు,మల్టీమీడియా ఛాలెంజ్ అనే ప్రత్యేక పోటీ నిర్వహించారు. ఇందులో ప్రపంచంలోని ప్రధాన ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి నాలుగు మందిని మిస్ వరల్డ్ సంస్థ విజేతలుగా ప్రకటించింది. శనివారం జరిగే తుది దశ కార్యక్రమానికి మొత్తం 108దేశాలను ప్రాతినిధ్యం వహిస్తూ అందాల భామలు హాజరుకాబోతున్నారు.

వివరాలు 

8 మందిలో ప్రతి ఖండానికి ఇద్దరు చొప్పున పోటీదారులు

ప్రారంభంగా వారు ఖండాలవారీగా ర్యాంప్ వాక్ చేస్తారు.ఆ వాక్ తర్వాత ప్రారంభమైన మొదటి రౌండ్‌లో న్యాయనిర్ణేతలు వారిలో ఉత్తమంగా ఉన్న 40 మందిని ఎంపిక చేస్తారు. ఈ 40 మందిలోనుంచి తదుపరి దశకు 20 మందిని సెలెక్ట్ చేస్తారు. అనంతరం వాటిలో నుండి 8 మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ 8 మందిలో ప్రతి ఖండానికి ఇద్దరు చొప్పున పోటీదారులు ఉంటారు. వీరిని సమకాలీన సామాజిక సమస్యలు మరియు ఇతర ముఖ్య అంశాలపై ప్రశ్నలతో పరీక్షిస్తారు.

వివరాలు 

విజేతగా ఎంపికైన అందాల భామకు 2024 మిస్ వరల్డ్ టైటిల్

వారి సమాధానాలు,ఆలోచనశైలి,సమస్యలపై వారి అవగాహనను బట్టి ఒక్కొక్క ఖండం నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు నాలుగు మంది పోటీదారులు ఉంటారు. చివరగా, "మీరు మిస్ వరల్డ్‌గా ఎంపికైతే ఎలాంటి మార్పులు తీసుకురాగలరు?" అనే ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నకు అత్యుత్తమ సమాధానాన్ని ఇచ్చిన వ్యక్తినే మిస్ వరల్డ్‌గా ప్రకటిస్తారు. విజేతగా ఎంపికైన అందాల భామకు 2024 మిస్ వరల్డ్ టైటిల్ దక్కుతుంది. ఈమెకు క్రిస్టినా పిజ్కోవా - ప్రస్తుత మిస్ వరల్డ్ - కిరీటం పెట్టి గౌరవిస్తారు.