జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేని కొనసాగించేందుకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్వేను ప్రారంభించుకోవచ్చని తీర్పునిచ్చింది. వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. న్యాయ ప్రయోజనాల కోసం సైంటిఫిక్ సర్వే చేపట్టడం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.మసీదులో శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని జులై 21న వారణాసి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు భారత పురావస్తు విభాగం జులై 24న సర్వే మొదలుపెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా సర్వేపై 2 రోజుల పాటు స్టే విధించింది. అనంతరం వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలని మసీదు కమిటీకి సూచించింది. తాజాగా వారణాసి కోర్టు ఉత్తర్వులనే హైకోర్టు సమర్థించింది.