రాముడు, కృష్ణుడిపై ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఫిర్యాదుతో కేసు నమోదు
యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాముడు, కృష్ణుడిపై అభ్యంతరకరంగా మాట్లాడారు.దీంతో హిందూ అనుకూల సంస్థలు ఆయనపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం కేసు నమోదైంది. వర్సిటీలోని మధ్యయుగ, ఆధునిక చరిత్ర విభాగం ప్రొఫెసర్ విక్రమ్ హరిజన్ శ్రీరాముడు ఇవాళ ఉండుంటే ఋషి శంభుకుడిని చంపినందుకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జైలుకు పంపేవాడినన్నారు. కృష్ణుడు జీవించి ఉంటే,స్త్రీలపై లైంగిక వేధింపుల కేసులో జైలుకు పంపేవాడ్ని అని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్, భజరంగ్ దళ్ మండిపడ్డాయి. ప్రొఫెసర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సహేతుకం కావని, హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.