Page Loader
US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!
అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!

US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2024
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఎక్కువమంది భారతీయులు చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ రెబెకా డ్రామే తెలిపారు. విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనను పంపినట్లు ఆమె వెల్లడించారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల సందర్భంగా ఆమె, ప్రజాసంబంధాల అధికారి అలెగ్జాండర్‌ మెక్‌ లారెన్‌తో కలిసి విశాఖలో పర్యటించారు. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో ఉన్నారు.

Details

రోజుకు 1600 వీసాలు జారీ

2023-24 నాటికి 3.3 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. వారిలో 56 శాతం ఏపీ, తెలంగాణకు చెందినవారే. తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం విద్యార్థులు ఉన్నారని రెబెకా వెల్లడించారు. హైదరాబాద్‌ కాన్సుల్‌ జనరల్‌లో ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువ నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాలు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు 1,600 వీసాలు జారీ చేస్తున్నామనీ, 2025 ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్యను 2,500కి పెంచాలనే లక్ష్యం ఉంచుకున్నామని వివరించారు. విద్యార్థుల వీసాల అపాయింట్‌మెంట్‌ నిరీక్షణ సమయాన్ని 3 నెలలకు తగ్గించామని, 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు తెలిపారు.

Details

 వీసా ప్రక్రియను మరింత సులభతరం చేస్తాం

ప్రత్యేకంగా భారతీయుల కోసం రూపొందించిన హెచ్‌1బీ డొమెస్టిక్‌ రీవాలిడేషన్‌ ప్రోగ్రామ్‌ పైలట్‌గా అమలుచేసి, 10,000 మంది హెచ్‌1బీ వీసాలను పునరుద్ధరించామని వెల్లడించారు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్‌ కోర్సుల కోసం అమెరికాకు వెళ్తున్నారని, భవిష్యత్తులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. భారత విద్యార్థుల ఆకాంక్షలను తీర్చేందుకు వీసా ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని రెబెకా డ్రామే తెలిపారు.