LOADING...
Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు

Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ కార్యాలయ పనులను ప్రారంభించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయుని పాలెం వద్ద పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ హయాంలో రూ. 160 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 7 అంతస్తుల సీఆర్‌డీఏ కార్యాలయ భవనం 2017లో ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు నిలిపివేశారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 3.62 ఎకరాల్లో జరుగుతోంది. భవన నిర్మాణంతో పాటు,అదనంగా పార్కింగ్‌,ల్యాండ్‌ స్కేపింగ్‌ కోసం 2.51 ఎకరాలు కేటాయించారు. అయితే,ప్రస్తుతానికి ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్స్‌,ఇంటీరియర్స్‌,ఎలక్ట్రిక్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

వివరాలు 

రాజధాని అభివృద్ధి కోసం 54,000 ఎకరాలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ,"చరిత్రను తిరగరాయడానికి మేము ఇక్కడ సమావేశమయ్యాం.రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేశాం.అప్పట్లోనే ముందుచూపుతో 8వరుసల రోడ్లను నిర్మించాం.శంషాబాద్‌ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. అభివృద్ధికి ఎక్కడైనా ప్రతిబంధకాలే ఉంటాయి," అని తెలిపారు. అమరావతి రైతులను ఒప్పించి భూములు సేకరించామని, 54,000 ఎకరాలు రాజధాని అభివృద్ధి కోసం సేకరించామన్నారు. "మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడారు," అని చంద్రబాబు గుర్తుచేశారు. "అమరావతి రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉన్న కేంద్రం,ఒక రాష్ట్రం,ఒక రాజధాని అని అన్నిచోట్లా ప్రకటించాను.విశాఖపట్టణంని ఆర్థిక రాజధానిగా చేస్తాం.కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం,"అని ఆయన వివరించారు.