తదుపరి వార్తా కథనం

Amarnath yatra: జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 06, 2025
08:11 am
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి ఈ సంవత్సరం జరిగే అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి.
జులై 3న యాత్ర ప్రారంభం కానుందని బుధవారం ఒక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.
శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు.
''అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్ మార్గం, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల ద్వారా జులై 3న యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 38 రోజుల పాటు కొనసాగి, ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది'' అని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
3 जुलाई से शुरू होगी अमरनाथ यात्रा #AmarnathYatra #Amarnath2025@SabeenaTamang pic.twitter.com/UphczabALT
— News18 India (@News18India) March 6, 2025