Page Loader
One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ 

One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ 

వ్రాసిన వారు Stalin
Sep 02, 2023
10:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యుల కమిటీ రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమా? లేదా? అనేది పరిశీలించనుంది. . జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీలో హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎన్.కె.సింగ్, న్యాయవాది హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి ఉన్నారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా సిఫార్సులు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్