
దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష కూటమికి చెందిన ఎంపీలకు సూచనలు చేశారు.
ప్రతిపక్షాలు తమ కూటమి(ఇండియా) గురించి కాకుండా దిల్లీ గురించి ఆలోచించాలన్నారు. నెహ్రూ, అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్, వల్లాభాయ్ పటేల్, రాజగోపాలచారి సైతం దిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని షా గుర్తు చేశారు.
కూటమిలో ఉన్న కారణంతో అవినీతికి మద్దతు పలకకూడదని కోరుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో (2024 సార్వత్రిక ఎన్నికలు) ప్రధాని మోదీ పూర్తి ఆధిక్యతతో విజయం సాధిస్తారని షా చెప్పుకొచ్చారు.
DETAILS
వారికి ఘర్షణ పడటం తప్ప వేరే ఉద్దేశం లేదు : అమిత్ షా
2015లో దిల్లీలో ఓ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చింది. వారి ఘర్షణ పడటం తప్పించి వేరే ఉద్దేశం లేదు.
తమకు బదిలీల అంశం సమస్య కాదని, బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో ఎంతో అవినీతి దాగి ఉంది.అయితే ఆ అవినీతిని దాచి పెట్టేందుకే విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటం అసలు సమస్య అని షా అన్నారు.
జాతీయ రాజధాని దిల్లీలోని ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రానికి, దిల్లీ సర్కారుకు మధ్య గత కొంత కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.
దీనిపై దిల్లీ ప్రభుత్వం సుప్రీంలో న్యాయ పోరాటం చేసింది. ఈ మేరకు ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయినప్పటికీ దిల్లీకి చట్టాలు చేసేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అనుమతిస్తున్నాయని అమిత్ షా వివరించడం గమనార్హం.
EMBED
కూటమి కట్టినా మోదీకే పూర్తి మెజారిటీ వస్తుంది : షా
https://twitter.com/ANI/status/1687032012258050049