Amith Shah : మధ్యప్రదేశ్ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా
మధ్యప్రదేశ్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీలను గుప్పించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. నవంబరు 15తో ప్రచారానికి తెరపడనుంది. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా, తాను భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని రాహుల్ గాంధీ అడిగేవారని, ఇప్పుడు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగుతుందన్నారు. అయోధ్య రామ దర్శనం కోసం తాము డబ్బులు ఖర్చు చేయాలా అని ఓ సీనియర్ బీజేపీ నేత అడిగారు. మీరు దేవికి ఖర్చూ పెట్టాల్సిన అవసరం లేదని, మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే చాలన్నారు.