TVK: టీవీకేపై ఏఎంఎంకే సంచలన ఆరోపణలు.. 'ఫోర్జరీ' కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే (అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం) పార్టీ టీవీకేపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసిందని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ఏఎంఎంకే నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ అని తెలిసిందే. ఆయన ఆచూకీ కనిపించడం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గవర్నర్ ఆర్లేకర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
వివరాలు
టీవీకే-ఏఎంఎంకే మధ్య ముదురుతున్న వివాదం
అదే సమయంలో టీవీకేకు తమ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ నకిలీదని, దాన్ని టీవీకే తయారు చేసిందని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు దినకరన్ అర్ధరాత్రి ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే తీవ్రంగా ఖండించింది. విజయ్‌కు మద్దతు ఇస్తూ కామరాజ్ స్వయంగా లేఖ రాస్తున్నట్లుగా ఉన్న వీడియోను టీవీకే విడుదల చేసింది. ఆ వీడియోలో కామరాజ్, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నట్లు చూపించారు. దీనిపై టీవీకే స్పందిస్తూ, దినకరన్ వాస్తవాలను దాచిపెడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో టీవీకే-ఏఎంఎంకే మధ్య వివాదం మరింత తీవ్రతరమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముదురుతున్న వివాదం
#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy Range
— ANI (@ANI) May 8, 2026
This comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8