Amrit Bharat Rail : ఏపీకి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే
కేంద్రం రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇందుకు సంబంధించి మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. అయితే అమృత్ భారత్ రైళ్లను ప్రత్యేక సదుపాయాలతో ప్రవేశపెడుతున్నారు. ప్రధాని మోదీ డిసెంబర్ 30న రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. 1.మొదటిది యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్బంగా 2.రెండోది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా - బెంగళూరుల మధ్య ఏపీ మీదుగా ప్రయాణం చేయనుంది. గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లో 12 స్లీపర్ క్లాస్, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి.
ఏపీలోని రూట్ మ్యాప్ ఇదే
ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించనుంది. కానీ ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఈ రైలుకు స్టాపులను నిర్ణయించారు. ఆకట్టుకునే ఫీచర్స్ సొంతం : అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంటాయి. 50 కి.మీలోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. దీనికి రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం తిరిగి చెల్లించని(రీయంబర్స్ చేయని) రాయితీలను ఈ రైళ్లల్లో అనుమతించరు.
దశల వారీగా దేశమంతా అమలు
తొలి రైలులో సెకెండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉంటాయి. ఏసీ ఛార్జీలు ఖరారు కాలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల పాసులు మాత్రం అనుమతించాలని నిర్ణయించారు. ఈ రైళ్లో జీరో డిశ్చార్చ్ FRP మాడ్యులర్ టాయలెట్ ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఉంది. ఆధునిక డిజైన్,చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్‌లను రెఢీ చేశారు. టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ దీని స్పెషాలిటీ. రేడియంతో తళతళలాడే ఫ్రోర్లింగ్ స్ట్రిప్‌లు ఇందులో ఉన్నాయి. ప్రయాణీకులకు మంచి అనుభూతిని పంచేలా ఫ్రీ సెమీ పెర్మనెంట్ కపులర్స్ సిద్ధం చేశారు. బాటిల్ హోల్టర్, మొబైల్ చార్జర్ కోసం హోల్డర్‌లు ఉంటాయి. దశల వారీగా దేశమంతా ఈ రైళ్లను విస్తరించనున్నారు.