SFJ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు
భారత్ -పాకిస్థాన్ ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌కు ముందు కెనడాకు చెందిన నిషేధిత సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదైంది. బెదిరింపులు పాల్పడడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)ను నమోదు చేశారు. వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ముందస్తుగా రికార్డ్ చేయబడిన బెదిరింపు సందేశాలు పంపిన తర్వాత ఈ పరిణామం జరిగిందని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ DCP అజిత్ రాజియన్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI తెలిపింది. అనేక బెదిరింపు కాల్‌లు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తూ కొంతమంది స్థానికులు అహ్మదాబాద్ పోలీసులను కూడా ఆశ్రయించారు.
నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపు సందేశం
అందిన సమాచారం మేరకు, ముందే రికార్డ్ చేసిన బెదిరింపు సందేశంలో, నిషేధిత సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు కూడా గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మాట్లాడుతూ..ఇది ప్రపంచ కప్ క్రికెట్ ప్రారంభం కాదు,ఇది ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభం.ఇది నిజ్జర్ హత్యకు ప్రతీకారం''అని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు,కార్యకలాపాలను ప్రోత్సహించడం, భయాన్ని వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉగ్రవాదిపై యాంటీ-టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ తన మొదటి కేసును 2019లో నమోదు చేసినప్పటి నుండి పన్నూన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రాడార్‌లో ఉన్నాడు.
పన్నూపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన ఎన్ఐఏ
అతని బెదిరింపులు,వ్యూహాల ద్వారా పంజాబ్ అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలలో భీభత్సం సృష్టిస్తున్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నూపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడు" (PO)గా ప్రకటించింది. ఇటీవలి రోజుల్లో, సీనియర్ భారతీయ దౌత్యవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులను బహిరంగ వేదికలపై బెదిరింపులకు గురి చేసినందుకు పన్నూన్ వార్తల్లో నిలిచారు.