Ayodhya: ప్రపంచంలోనే ఖరీదైన మామిడితో రాముడికి ప్రసాదం.. ప్రత్యేకత ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని బాల రాముడికి అత్యంత అరుదైన, ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లలో ఒకటిగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఈ ప్రత్యేక రకం మామిడి పండ్లు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైనవిగా గుర్తింపు పొందాయి. ఈ మియాజాకీ మామిడిపండ్ల ధర కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. ఒక్కో పండు ధరే దాదాపు రూ.లక్షకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.
వివరాలు
బాల రాముడికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం
ఈ అరుదైన మామిడి పండ్లను రైతు ఓం ప్రకాశ్ సింగ్ సాగు చేశారు. ఆయన వద్ద నుంచి వాటిని కొనుగోలు చేసిన మియాజాకీ, అయోధ్య బాల రాముడికి భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ప్రత్యేకంగా తులసి ఆకుల్లో ఈ మామిడిపండ్లను ఉంచి బాల రాముడికి సమర్పించడం విశేషంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిపండ్లను నైవేద్యంగా అర్పించడం భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.