Page Loader
Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌ 
Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌

Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2023
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని సుబ్రమణ్యపోరా ప్రాంతంలో తన ఇంట్లో శవమై కనిపించిన కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమను హత్యను పోలీసులు ఛేదించారు. హత్య కేసుకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 7నుండి 10 రోజుల ముందు అతన్ని పని నుండి తొలగించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న డ్రైవర్ తాను ప్రతిమను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఎన్‌డిటివి వర్గాలు తెలిపాయి. తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకే ఆమెను చంపేశానని డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్‌ను కిరణ్‌గా గుర్తించామని, అతను బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్‌కు పారిపోయాడని వర్గాలు తెలిపాయి.

Details 

మృతదేహంపై గొంతు కోసిన గాట్లు

ప్రతిమ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో జియాలజిస్ట్.ఆమె భర్త,కొడుకు బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంటున్నారు. ప్రతిమ మృతదేహంపై గొంతు కోసిన గాట్లు ఉన్నాయి.పోలీసులకు ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆమె సోదరుడు సమాచారం అందించాడు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఆమె కార్యాలయంలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత కిరణ్ స్థానంలో నియమించిన డ్రైవర్ ఆమెను తన ఇంటి వద్ద దింపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఈ హత్య శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య జరిగినట్లు భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు ఎన్‌డిటివికి తెలిపాయి.

Details 

ప్రతిమ కుటుంబానికి న్యాయం చేస్తాం: సిద్దరామయ్య 

ప్రతిమ,శివమొగ్గలో మాస్టర్స్ పూర్తి చేసింది. బెంగళూరులో సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తోంది. రాష్ట్ర పర్యావరణ శాఖకు చెందిన సీనియర్ అధికారి దినేష్ మాట్లాడుతూ ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అన్నారు. ఆమె ఇటీవల కొన్ని చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించిందని విలేకరులతో అయన తెలిపారు. ఆమెకు శత్రువులు ఎవరు లేరని.. తన పనిని చక్కగా చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు. హత్యకు గురైన ప్రతిమ కుటుంబానికి న్యాయం చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.