తదుపరి వార్తా కథనం
Anand Mahindra : అలా చూస్తే బాధ కలుగుతోంది.. ముంబై నగర పాలిక పై ఆనంద్ మహీంద్రా
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 21, 2023
04:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా మరోసారి సామాజిక సమస్య మీద స్పందించారు. భారతదేశం ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే చెత్తా చెదారం సముద్రంలో పడేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే అలా చూస్తేనే తనకు బాధ కలుగుతుందన్నారు. పరిశుభ్రతపై పౌర దృక్పథంలో మార్పు రాకుంటే, భౌతిక మౌలిక సదుపాయాల్లో ఎంత మెరుగుదల ఉన్నా నగర జీవన నాణ్యతను మెరుగుపరచదన్నారు.
గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర అరేబియా సముద్రంలో కొందరు, చెత్తను డంపింగ్ చేస్తున్న వ్యక్తుల వీడియో వైరల్ అయ్యింది.
ఏకంగా పగటిపూట సముద్రంలో చెత్త సంచులను డంపింగ్ చేస్తున్న వ్యక్తులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో BMC కమీషనర్ ఇక్బాల్ చాహల్, ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పట్టపగలే సముద్రంలో చెత్త డంపింగ్ చేస్తున్న వ్యక్తులు
The Good Citizens of Mumbai
— Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023
Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28