Page Loader
Pamidi Samanthakamani:అనంతపురంలో వైసీపీకి షాక్...మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి రాజీనామా
అనంతపురంలో వైసీపీకి షాక్...మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి రాజీనామా

Pamidi Samanthakamani:అనంతపురంలో వైసీపీకి షాక్...మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి రాజీనామా

వ్రాసిన వారు Stalin
Apr 08, 2024
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురంలో వైసీపీకి మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి షాకిచ్చారు. పార్టీ సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు తాను, తన కుమారుడు పమిడి అశోక్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా ప్రతాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా సోమవారం పంపించారు. ఇటీవలే శమంతకమణి కుమార్తె యామినీ బాల కూడా వైసీపీకి గుడ్ చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శమంతకమణి 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1989‌‌-91 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రి గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలుగుదేశం (టీడీపీ)లో చేరారు.

Pamidi Resigned

టికెట్​ ఇవ్వలేదని పార్టీలు మారుతున్నారా?

అనంతరం 2014లో కుమార్తె యామిని బాల టీడీపీ తరఫున శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో అప్పటివరకు ఎమ్మెల్యే గా ఉన్న యామిని బాలకు టికెట్ కాదని బండారు శ్రావణికి టీడీపీ అవకాశం కల్పించింది. తమ కుమార్తె టికెట్ కోసం శమంతకమణి ఎంతగా ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు కనికరించలేదు. దీంతో టీడీపీ తరఫున అప్పటికే ఎమ్మెల్సీ గా ఉన్న శమంతకమణి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకొచ్చేశారు. అనంతరం శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్, కుమార్తె యామినీ బాల కలసి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా టికె ట్ లభించకపోవడంతో ఆ పార్టీ నుంచి కూడా వీరు బయటకొచ్చేశారు.