Page Loader
Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ 
తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ 

వ్రాసిన వారు Stalin
Jun 02, 2024
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ప్ర‌సంగం అనంత‌రం జ‌య జయ‌హే తెలంగాణ అంటూ సాగే రాష్ట్ర గీతాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. 2 నిమిషాల‌కు పైగా సాగే ఈ గేయానికి (Telangana State anthem) క‌వి అందెశ్రీ (Andesri) సాహిత్యం సమకూర్చారు. ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందించారు. ఈ గేయానికి కీర‌వాణి (MM Keeravani) మ్యూజిక్ అందించ‌డంపై ముందు నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

Details 

జై తెలంగాణ పాట వింటూ అందెశ్రీ కంట కన్నీరు

అయిన‌ప్ప‌టికీ అవేమీ ప‌ట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ముందుకు వెళ్లింది. చివ‌ర‌కు గేయాన్ని విడుద‌ల చేసింది. దశాబ్ది ఉత్స‌వాల్లో రాష్ట్ర గేయాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ గేయం ఆల‌పిస్తుండ‌గా..క‌వి అందెశ్రీ భావోద్వేగానికి గుర‌య్యారు. ఆనందంతో ఉప్పొంగి క‌నిపించారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్నా జై తెలంగాణ పాట వింటూ అందెశ్రీ కంట కన్నీటితో ఆ పాటను ఆలకిస్తూ భావోద్వేగం చెందారు.

Details 

పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత

పాట వింటున్నంత సేపు ఆయన కళ్లలో కన్నీరు ఆగలేదు. తెగింపు, త్యాగాల చరిత్ర కలిగిన ఈ పాటతో ఫరేడ్ గ్రౌండ్ లో అంతా సాగింది. కాగా.. అనంతరం కీరవాణి ని మాట్లాడమన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు.. ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత... రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, సత్తువుంది... తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భావోద్వేగానికి గురైన అందెశ్రీ (వీడియో)