Page Loader
AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  
పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుండి ప్రారంభమై,ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం నిర్వహించబడింది. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడాన్ని కొనసాగిస్తున్నారు,ఇది దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత,వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే,అన్ని పనులు సరిగా జరిగితే,ఏప్రిల్ 22వతేదీన పదో తరగతి ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షలకు మరో వారంలో తెరపడనుంది.

వివరాలు 

పరీక్షలకు మొత్తం 6,49,884 మంది విద్యార్థులు

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు మొత్తం 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే, ఏప్రిల్ 3 నుండి 7వ తేదీ వరకు,సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించబడ్డాయి, ఇవి మార్చి 17 నుండి 28 వరకు జరిగాయి. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది,ఈ పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కావచ్చును. ఇప్పటికే, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం, ఇంటర్‌ విద్యార్థులకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు 'మిత్రా' వాట్సాప్‌ యాప్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

వివరాలు 

మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసి..

అదే విధంగా, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను కూడా వాట్సాప్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకునే సౌకర్యం ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు, పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15తో ముగియనుంది. ఏప్రిల్ 7 నుండి 19 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభమవగా, నేటితో మూల్యాంకనం పూర్తవ్వనుంది. ఆ తర్వాత మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసి, త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.