Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 50,000 కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, రిటైల్ వ్యాపారం ద్వారా రాష్ట్రంలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహిస్తుందని చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.
'ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారైన వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులను రిటైల్ వ్యాపారం ద్వారా దేశం అంతా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.
రిలయన్స్ రిటైల్ ఆంధ్రప్రదేశ్‌లోని 6,000 గ్రామాల్లో 1.2 లక్షల మందికి పైగా కిరాణా వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉందని అంబానీ వెల్లడించారు.
చిన్న వ్యాపారాలు, డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను సమకూర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్ రిటైల్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 20,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలను అందించినట్లు వివరించారు.
అనిల్ అంబానీ
నవ భారత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర: అంబానీ
2023 చివరిలోపు ఆంధ్రప్రదేశ్‌తో సహా భారతదేశం అంతటా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ముకేశ్ అంబానీ చెప్పారు.
40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో, జియో రాష్ట్రంలో అతిపెద్ద, ఉత్తమ డిజిటల్ నెట్‌వర్క్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రాకు విస్తారమైన సముద్ర సరిహద్దు ఉందని, రాష్ట్రాన్ని నీలి ఆర్థిక వ్యవస్థగా మార్చగల సామర్థ్యం ఉందని అన్నారు. నవ భారత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.