అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశ వినియోగదారుల సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో జన్యు టెస్టింగ్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఉత్పత్తిని అభివృద్ధి చేసిన బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ హరిహరన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. RIL ఈ సంస్థను 2021లో కొనుగోలు చేసింది, దాదాపు 80 శాతం వాటా కూడా ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్‌ను ప్రవేశపెట్టే ప్రణాళికకు సంబంధించిన అధికారిక ప్రకటన RIL విడుదల చేయలేదు. జీనోమ్ టెస్టింగ్ కిట్ ధర రూ. 12,000, స్థానికంగా లభించే ఇతర కిట్ ల కంటే దాదాపు 86 శాతం చౌకగా ఉంటుంది.
కొత్త జీనోమ్ టెస్టింగ్ కిట్ భారతదేశ ప్రమాణాలను నిర్దేశిస్తుంది
ఈ పరీక్ష క్యాన్సర్‌లు, గుండె సంబంధిత, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులకు కారణాలను తెలియచేస్తుందని, అలాగే వారసత్వంగా వచ్చే జన్యుపరమైన రుగ్మతలను గుర్తించగలదని హరిహరన్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలను వ్యక్తిగత జన్యు-మ్యాపింగ్‌కు పరిచయం చేస్తుంది. ఔషధ అభివృద్ధికి సహాయపడటమే కాకుండా అనేక వ్యాధుల గురించి జీవసంబంధమైన డేటాను సమర్ధవంతంగా సృష్టిస్తుంది. RIL రూపొందించిన కొత్త జీనోమ్ టెస్టింగ్ కిట్ భారతదేశ ప్రమాణాలను నిర్దేశిస్తుందని రమేష్ హరిహరన్ అన్నారు.