ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజైన శనివారం దాదాపు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. 13కంటే ఎక్కువ రంగాలలో 260 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా ఎంఓయూలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల విలువైన మొత్తం 352 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. పెట్టుబడులను ఆకర్షించిన రంగాల్లో ఇంధన శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఐటీ&ఐటీఈఎస్ శాఖ, పర్యాటక శాఖ, వ్యవసాయం & పశుసంవర్ధక శాఖ ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారులలో రిలయన్స్ 1,00,000 మందికి ఉపాధిని కల్పించే 5 లక్షల కోట్ల పెట్టుబడితో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
మొదటి రోజు రూ.11,87,756 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకం
హెచ్‌పీసీఎల్ రూ.14.3 కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని వల్ల 1500 మందికి ఉపాధి లభిస్తుంది. హెచ్‌సీఎల్ రూ.22 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధిని కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఫ్లిప్‌కార్ట్ రూ.20కోట్ల పెట్టుబడితో 300 మందికి ఉపాధి కల్పించే 2అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదటి రోజు రూ.11,87,756 లక్షల కోట్ల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకాలు చేసింది. ప్రధాన పెట్టుబడిదారుల్లో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) రూ.2,35,000 కోట్ల పెట్టుబడితో 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 77,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది.