Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు తెలంగాణలో ఓటు హక్కు ఉంది. ఈ క్రమంలో ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులు (employees) తెలంగాణలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యోగుల సంఘం నేతల విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి చెందిన ఉద్యోగులు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. దీంతో ఏపీ ఉద్యోగులు ఓటు వేయాలని అనుకుంటే, వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయనున్నట్లు ఈసీ పేర్కొంది.