Page Loader
Maharastra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు
మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు

Maharastra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మధ్య ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి జరిపారు. ఈ ఘటన నాగ్‌పుర్ జిల్లా జలాల్‌ఖేడా రోడ్డులో బెల్‌ఫాటా సమీపంలో జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, నార్ఖేడ్‌లో నిర్వహించిన సమావేశం అనంతరం కటోల్‌కు వెళ్తున్న అనిల్ దేశ్‌ముఖ్ ప్రయాణ వాహనంపై రాళ్లు విసిరారు. దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే కటోల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు నాగ్‌పుర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దర్ తెలిపారు.

వివరాలు 

గతంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి

అనిల్ దేశ్‌ముఖ్ గతంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, కోట్ల రూపాయల లంచం డిమాండ్ ఆరోపణలతో మంత్రిపదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు.