MK Stalin: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీ ప్రాంగణంలో ఓవిద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈఘటనపై డీఎంకే అధినేత,ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈకేసులో నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ఆయన అంగీకరించారు,అయితే అతను పార్టీలో సభ్యుడు కాదని పేర్కొన్నారు.
మహిళల భద్రత తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని స్టాలిన్ తెలిపారు.
"నిందితుడు డీఎంకే మద్దతుదారుడే అయినా,అతనికి ఎటువంటి రక్షణ అందించడంలేదు.ఈ ఘటనపై కేసునమోదైన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు.విచారణ కొనసాగుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వారెవరైనా సరే కఠిన చర్యలు తప్పవు"అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిమాత్రమే కాకుండా,డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల భద్రత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు.
వివరాలు
డిసెంబరు 23న చెన్నై అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఘటన
ఉచిత బస్సు ప్రయాణం, రూ. 1,000 ఆర్థిక సహాయం,ఉన్నత విద్య కోసం పథకాలు వంటి చర్యల ద్వారా మహిళలకు మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.
డిసెంబరు 23న చెన్నై అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా,అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె స్నేహితుడిపై దాడి చేసి అతనిని తరిమి పంపించారు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేసి, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.