Page Loader
Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్ 
రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్

Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్ 

వ్రాసిన వారు Stalin
Jun 15, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 19న 'హరితోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది. చెట్లను పెంచడం, పచ్చదనం, హరితహారం ప్రాముఖ్యను వివరిస్తూ ఆకట్టుకునేలా రీల్స్, వీడియోలు చేసిన వారిని బహుమతలు, అవార్డులు అందజేస్తామని అటవీ శాఖ వెల్లడించింది. అభ్యర్థులు పంపిన వీడియోలు, రీల్స్‌లో అవార్డుల కోసం ఉత్తమమనవి ఎంపిక చేస్తామని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా పచ్చదనంపై అవగాహన కల్పించేందుకు ఔత్సాహికుల నుంచి ఉత్తమ వీడియోలను తెలంగాణ అటవీశాఖ సేకరించనుంది. ఆసక్తి ఉన్న వారు నివిమిష నిడివి కల వీడియోలను tkhh2023@gmail.com ఈ మెయిల్ అడ్రస్‌కు పంపాలని అటవీశాఖ ప్రకనటలో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ అటవీశాఖ చేసిన ట్వీట్