TG Govt: తెలంగాణ మహిళా సంఘాలకు భారీ ఊతం..మరో 448 అద్దె బస్సుల కేటాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం గట్టి ప్రోత్సాహం అందిస్తోంది. మహిళలను ఉద్యోగావకాశాలతో పాటు స్థిర ఆదాయ మార్గాల వైపు నడిపించే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సులను కేటాయించనున్నట్లు మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, వాటిని టీఎస్‌ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడతలో ఉమ్మడి వరంగల్,కరీంనగర్,మహబూబ్‌నగర్,ఖమ్మం జిల్లాలకు చెందిన 150 మహిళా సంఘాలకు 150 బస్సులు సమకూర్చి ఈ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు రెండో దశలో మరింతగా 448 బస్సులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పొన్నం ప్రభాకర్ చేసిన ట్వీట్
మహిళా సంఘాల సాధికారతకు భారీ ఊతం
— Ponnam Prabhakar (@Ponnam_INC) December 1, 2025
మరో 448 అద్దె బస్సుల కేటాయింపు
మహిళల ఆర్థిక బలోపేతానికి దోహదం చేసే నిర్ణయాన్ని సహచర మంత్రి సీతక్క గారితో సంయుక్తంగా ప్రకటించడం జరిగింది
రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి…