
Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు మే 16వ తేదీ లోగా పరీక్ష ఫీజును చెల్లించాలి.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేది మే 17గా నిర్ణయించారు.
రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.500 ఫీజు వసూలు చేయనున్నారు. అదేవిధంగా రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది.
Details
బాలికల కంటే బాలురు 2.64 శాతం ఎక్కువ ఉత్తీర్ణత
అయితే రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఆగకుండా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇక 2025లో జరిగిన పదో తరగతి ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78గా నమోదైంది.
బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 94.26 శాతం మార్కులతో ముందున్నారు. బాలికల కంటే బాలురు 2.64 శాతం తక్కువగా ఉత్తీర్ణులయ్యారు.