NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే
    తదుపరి వార్తా కథనం
    'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే
    'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే

    'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 29, 2023
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిర్భయ ఘటన తరహాలో మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒళ్లంతా పంటి గాట్లతో గాయాలు చేసి, ఆమె ప్రైవేటు భాగాల్లో కర్రను చొప్పించి రాక్షసంగా ప్రవర్తించారు.

    గాయాలతో అడవిలో రక్తపుమడుగులో దొరికిన ఆ చిన్నారి ఇప్పుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

    మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా మైహర్ టౌన్‌లోని ప్రఖ్యాత శారదా దేవి గుడికి సమీపంలోని అడివిలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది.

    12 ఏళ్ల బాలికను ఆలయ ట్రస్టులో పనిచేస్తున్న ఇద్దరు మభ్యపెట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై రాక్షసంగా ప్రవర్తించి, ఉన్మాదాన్ని చాటుకున్నారు.

    Details

    బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి : మధ్యప్రదేశ్ మాజీ సీఎం

    తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాలికను ప్రాథమిక చికిత్స అనంతరం రేవాలోని ఆస్ప్రతికి పోలీసులు తరలించారు. తమ ఉద్యోగులు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు వారిని విధుల్లోని తొలగిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.

    విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఆస్పత్రి వద్దకు చేరుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

    మధ్యప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ కరువైందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విమర్శించారు. బాలికకు మెరుగైన చికిత్స అందించి బాధిత కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

    Details

    ఉత్తరాఖండ్ లో భార్యను పూడ్చిపెట్టిన భర్త

    ఉత్తరాఖండ్‌లో భార్యను హత్య చేసి భర్త పూడ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ లోని రుద్రపుర్ లో రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. నిందితుడు సంతోష్ కుమార్ రెండు నెలల క్రితం తన భార్యను హతమార్చాడు.

    తర్వాత తన 17 ఏళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురి చేయడంతో బాలుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. అప్పుడే అసలు విషయం బయటికొచ్చింది.

    నిందితుడికి భార్యపై అనుమానం ఉండడం వల్లే ఆమెను హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఉత్తరాఖండ్

    తాజా

    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్
    Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు..  సూర్యకుమార్ యాదవ్
    MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా.. ఢిల్లీ క్యాపిటల్స్
    USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..!  అమెరికా

    మధ్యప్రదేశ్

    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్
    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు భారతదేశం
    ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్ విమానం

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025