
UP techie Suicide: భార్య వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య కలకలం సృష్టించిన తరుణంలో దేశవ్యాప్తంగా ఇటువంటి విషాద ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఫీల్డ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న మోహిత్ కుమార్ అనే యువకుడు భార్య, అత్తమామల వేధింపులు తాళలేక తన ప్రాణాలు తీసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు మోహిత్ ఓ భావోద్వేగ వీడియోను రికార్డు చేశాడు.
అందులో భార్య ప్రియ యాదవ్ తనను మానసికంగా వేధించడమే కాకుండా, తప్పుడు వరకట్న కేసుతో బెదిరిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన ఆస్తినంతా భార్య పేరుపై రాసి పెట్టాలని ఒత్తిడి తెచ్చిందని ఆరోపించాడు.
Details
అమ్మా, నాన్నా క్షమించండి
'ఈ వీడియో మీ చేతికి వచ్చే సమయానికి నేను బ్రతికి ఉండను. పురుషుల కోసం కూడా చట్టం ఉంటే బహుశా నేను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాను.
అమ్మా నాన్నా, దయచేసి నన్ను క్షమించండి అంటూ వీడియోలో పేర్కొన్నాడు.
మోహిత్ ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయ్యా జిల్లాకు చెందినవాడు.ప్రియతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న మోహిత్, ఆమెను వివాహం చేసుకున్నాడు.
ప్రియ ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఉద్యోగంలో చేరిన తరువాత నుంచే ఆమె మోహిత్‌తో దూరంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.
ఆమె తల్లి, సోదరుడితో కలిసి మోహిత్‌ను మానసికంగా హింసించడాన్ని మొదలుపెట్టినట్టు సమాచారం.
తన భార్య ప్రియ, ఆమె తల్లి కలిసి బలవంతంగా గర్భస్రావం చేయించారని, తన ఆభరణాలు, వస్త్రాలన్నీ తీసుకున్నారని బాధితుడు తెలిపాడు.
Details
న్యాయం జరగకపోతే మృతదేహాన్ని కాల్వలో పడేయండి
ఇంటిని, ఆస్తిని ఆమె పేరుపై రాసివేయాలని, లేదంటే తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్టు వివరించాడు.
తన మరణానంతరం కూడా న్యాయం జరగకపోతే తన దేహాన్ని కాలువలో పడేయాలంటూ వీడియోలో కన్నీరుమున్నీరుగా విలపించారు.
నోయిడాలోని జాలి హోటల్‌లో ఉరివేసుకొని మోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహిత్ సోదరుడు తరుణ్ ప్రతాప్ మాట్లాడుతూ, 'నా అన్న మోహిత్ ఓ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ప్రియ ప్రవర్తనే అతన్ని ఇలా చేయించింది. ఆమె వల్లే అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని వాపోయాడు.
ఈ ఘటన మరోసారి భార్యల వేధింపులపై, చట్టాల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చను తెరపైకి తెచ్చింది. పురుషుల కోసం కూడా రక్షణ చట్టాలు అవసరమన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.