Software Engineer: పని ఒత్తిడితో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
అధిక పని ఒత్తిడి కారణంగా 'ఎర్నెస్ట్ అండ్ యంగ్' లో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన మరవకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ఒత్తిడితో కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసింది. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చైన్నైలో ఉంటున్నాడు. 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు
పని ఒత్తిడి కారణంగా ఆయన రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు గురై చికిత్స పొందుతున్నారు. ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య పిల్లలను తన వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో కార్తికేయ్ విద్యుత్ తీగలు చుట్టుకొని విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.