
India-Pakistan War: పాక్ కాల్పుల్లో మరో తెలుగు జవాన్ వీరమరణం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ము దురుతున్నాయి.
పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుండగా, భారత్ వీటికి సమర్థవంతంగా ఎదుర్కోంటోంది. అయినప్పటికీ, కొన్ని చోట్ల ఈ దాడులు ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి.
శత్రుదేశం దాడుల్లో సాధారణ ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, దేశాన్ని రక్షించే జవాన్లు వీరమరణం పొందుతున్నారు.
ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ ఇప్పటికే వీరమరణం పొందారు.
ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇదే సమయంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Details
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
జమ్మూలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు. సచిన్ వయస్సు 29 ఏళ్లు. ఆయన మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని నాందేడ్ జిల్లా తమ్లూర్ ప్రాంతానికి చెందినవారు.
ఆయన మరణ వార్త తమ్లూర్‌లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ రోజు సచిన్ పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు భారత సైన్యం ఏర్పాట్లు చేస్తున్నది.
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగం యావత్ దేశం గుర్తుంచుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు సైన్యంలో సేవ చేస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలపై దేశ ప్రజల మానసిక మద్దతును కలిగిస్తున్నాయి.