West Bengal-Jp Nadda-Sandesh kali: పశ్చిమ బెంగాల్లో అరాచకం కొనసాగుతోంది...బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
బీజేపీ(Bjp)జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Jp Nadda)తృణమూల్ కాంగ్రెస్(TMC)అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benarji)పై విరుచుకుపడ్డారు. సందేశ్ కాళీ(Sandesh Kaali)లో సీబీఐ(CBI)కు భారీ ఎత్తున ఆయుధాలు (Wepons)లభించిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అరాచకం కొనసాగిస్తుందని విమర్శించారు . రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and Order) పరిస్థితి క్షీణించిందని మహిళలకు భద్రత లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తుందని జేపీ నడ్డా మండిపడ్డారు. సందేశ్ కాళీలో సీబీఐ చేపట్టిన తనిఖీల్లో విదేశాలకు చెందిన మూడు రివాల్వర్లు ఒక దేశవాళీ తపంచా, బుల్లెట్లు, క్యాటరిడ్జులు పట్టుబడిన సంగతి తెలిసిందే.
బెంగాల్లో 35 సీట్లకు పైగా బీజేపీ గెలుస్తోంది: జేపీ నడ్డా
ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జేపీ నడ్డా... మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 35 సీట్లకు పైగా గెలుస్తుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. సందేశ్ కాళీలో ఆయుధాలు పట్టు బడిన సంఘటనపై పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు అధికారి మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.