Page Loader
తమిళనాడు, తెలంగాణలో ఉగ్రవాద కదలికలపై ఎన్ఐఏ దాడులు
తమిళనాడు, తెలంగాణలో ఉగ్రవాద కదలికలపై ఎన్ఐఏ దాడులు తమిళనాడు, తెలంగాణలో ఉగ్రవాద కదలికలపై ఎన్ఐఏ దాడులు తమిళనాడు, తెలంగాణలో ఉగ్రవాద కదలికలపై ఎన్ఐఏ దాడులు

తమిళనాడు, తెలంగాణలో ఉగ్రవాద కదలికలపై ఎన్ఐఏ దాడులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 16, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు సహా తెలంగాణలో మరోసారి ఉగ్రవాద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 30 ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక బృందం సోదాలను నిర్వహిస్తోంది. కోయంబత్తూరు, చెన్నైలోని అనుమానిత ఇస్లామిక్ స్టేట్ శిక్షణా కేంద్రాల్లో ఉగ్రవాద నిరోధక సంస్థ, ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ISIS) శిక్షణా కేంద్రాలను ఛేదించేందుకు ఎన్ఐఏ తీవ్రంగా కృషి చేస్తోంది. సెప్టెంబర్ 6న, ఐఎస్ఐఎస్, త్రిస్సూర్ నాయకుడు సయ్యద్ నబీల్ అహమ్మద్‌ పరారీకి యత్నించగా, చెన్నైలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అహ్మద్ చాలా కాలంగా తమిళనాడు, కర్ణాటకలో తప్పించుకుని తిరుగుతున్నాడు. పేలుళ్లకు పాల్పడటం, నకిలీ పాస్‌పోర్ట్‌లతో తప్పించుకోవడం, నేపాల్‌ను రవాణా కేంద్రంగా ఉపయోగించుకోవడంలో అహ్మద్ నేర్పరి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఎన్ఐఏ