Page Loader
Rupali Ganguly: బీజేపీలో చేరిన 'అనుపమ' ఫేమ్ రూపాలీ గంగూలీ 
బీజేపీలో చేరిన 'అనుపమ' ఫేమ్ రూపాలీ గంగూలీ

Rupali Ganguly: బీజేపీలో చేరిన 'అనుపమ' ఫేమ్ రూపాలీ గంగూలీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2024
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

'అనుపమ'తో జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బుల్లితెర నటి రూపాలీ గంగూలీ ఇప్పుడు తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది. ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది.వినోద్ తావ్డే,అనిల్ బలూనితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటి ఈ సమాచారం ఇచ్చింది. అయితే,2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై ఆమె ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రూపాలీ గంగూలీ ఏం చెప్పింది? బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన రూపాలి తన నిర్ణయం వెనుక గల కారణాలను వివరించారు.రూపాలి మాట్లాడుతూ,'నేను ఇక్కడకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నారు.నేను ఆయనకు పెద్ద అభిమానిని. బీజేపీ చాలా మంచి పని చేస్తోంది అందుకే బీజేపీలో చేరానన్నారు .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీలో చేరాక మీడియాతో మాట్లాడుతున్న రూపాలీ గంగూలీ