Loading...
Andhra Pradesh: ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు, వాటి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అరుదైన ఖనిజాల అన్వేషణ, వాటికి విలువ జోడించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా 'ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (ఏపీఆర్ఈడీసీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా సీఎం అంగీకారం తెలిపారు.

వివరాలు 

ఎన్‌ఎండీసీ తరహాలో ఏపీఎండీసీ అభివృద్ధి

శుక్రవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు ఆదేశాలు జారీ చేశారు.

జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) తరహాలో ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఏపీఎండీసీ ఈక్విటీ విలువను ప్రాతిపదికగా చేసుకుని ఐపీవోకు వెళ్లేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్న ఖనిజ వనరులను కేవలం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వనరులుగా మాత్రమే చూడకూడదని సీఎం అన్నారు.

వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన ఆస్తులుగా పరిగణించాలని సూచించారు.

వివరాలు 

బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ

ఖనిజ సంపదకు మరింత విలువ జోడించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

రాష్ట్రంలో లభించే ఖనిజాలను వీలైనంత వరకు ఇక్కడే వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్న మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ మూడు బ్లాకుల్లో కలిపి సుమారు 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.

ఈ బ్లాకులు దక్కించుకోవడం ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరాకు భరోసా కల్పించవచ్చని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

క్వారీ లీజుల పరిష్కారంతో రూ.400 కోట్ల ఆదాయం

రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న క్వారీ లీజు దరఖాస్తుల పరిష్కారంపైనా సమావేశంలో చర్చించారు.

ప్రస్తుతం 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు.

వీటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని సమావేశంలో అంచనా వేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐదేళ్లలో అన్వేషణ, వేలం ప్రక్రియ వేగవంతం

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో ఖనిజాల అన్వేషణతోపాటు వేలం ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఖనిజ వనరుల గుర్తింపు నుంచి వాటి వినియోగం, విలువ జోడింపు వరకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు.

రాష్ట్ర ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు, స్థానిక అవసరాలకు ఉపయోగపడేలా ప్రణాళికలు అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ADVERTISEMENT