Page Loader
AP Assembly Session 2025: వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session 2025: వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలు సుమారు పది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు,ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఈ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టు అంశం పై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా, వారి పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది.

వివరాలు 

అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 500మంది మహిళా సాధికారత కమిటీ సభ్యులు

అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గత సమావేశాల్లో మొత్తం 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ లోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ, ''సెప్టెంబర్ 14,15 తేదీలలో తిరుపతిలో చట్టసభల జాతీయ మహిళా సాధికారత కమిటీల సదస్సు జరుగనుంది. ఏపీ ఆతిధ్యం ఇవ్వాలన్న పార్లమెంట్ స్పీకర్ సూచన మేరకు దీనిని నిర్వహిస్తున్నాం. అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 500మంది మహిళా సాధికారత కమిటీ సభ్యులు హాజరవుతారు. అలాగే ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో పది రోజులపాటు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నాం''అని తెలిపారు.