
AP Assembly: ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. కేటాయింపులు ఎవరెవరికి ఎలా అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు.
ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.35 లక్షల కోట్లు, మరియు మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు.
వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్టు పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
వివరాలు
వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా..
పాఠశాల విద్య రూ.29,909కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు
గృహనిర్మాణం రూ.4,012కోట్లు
జలవనరులు రూ.16,705కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు
ఇంధన రంగం రూ.8,207కోట్లు
రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు
పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు
పర్యావరణ,అటవీశాఖకు రూ.687కోట్లు