LOADING...
AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం సేకరణకు రూ.700 కోట్ల రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీని కేబినెట్‌ ఆమోదించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై చర్చ జరగడంతోపాటు, రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. 62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ డ్యూటీ టారిఫ్ తగ్గింపునకు ఆమోదం లభించింది.

వివరాలు 

అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ

నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజు కుడి, ఎడమ వైపుల మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2,595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపునకు కేబినెట్‌ అనుమతించింది. అలాగే, అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం కేబినెట్‌ సమావేశం కొనసాగుతుండగా, తీసుకున్న నిర్ణయాలను త్వరలో పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.