Page Loader
AP Skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు

AP Skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కోర్టులో విచారణలో ఉంది. సిఐడి తన ఛార్జిషీట్‌లో చంద్రబాబు నాయుడును ఎ1 గా, ఆ తర్వాత అచ్చెన్నాయుడును ఎ2గా, గంటా సుబ్బారావును ఎ3గా, మాజీ ఐఎఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణను ఎ4గా పేర్కొంది. చంద్రబాబు నాయుడుపై CID ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే మొదటి సారి కాదు.గతంలో ఫైబర్ నెట్, అసైన్డ్ భూములకు సంబంధించిన కేసుల్లో అభియోగాలు మోపారు.

Details 

రెండు నెలలు రాజమండ్రి జైలులో గడిపిన చంద్రబాబు

టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ముసుగులో షెల్ కంపెనీల కుంభకోణం, రూ.241 కోట్ల దుర్వినియోగం కారణంగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలలు రాజమండ్రి జైలులో గడిపిన చంద్రబాబు నాయుడు గత ఏడాది అక్టోబర్ 31న విడుదలయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు